ఈసీ ని కలవనున్న వైసీపీ నేతలు : చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు
మరి కొద్ది గంటల్లో పోలింగ్ మొదలవుతుందనగా ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.

మరి కొద్ది గంటల్లో పోలింగ్ మొదలవుతుందనగా ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
అమరావతి: మరి కొద్ది గంటల్లో పోలింగ్ మొదలవుతుందనగా ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. వైసీపీ నేతలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతి సెక్రటేరియేట్ లోని ఈసీ ఆఫీసు ముందు ధర్నా చేయటం ఎన్నికల కోడ్ ఉల్లంఘించటం కిందకే వస్తుందని వారు ఫిర్యాదు చేయనున్నారు.
Read Also : మాయ చేయొద్దు : మోడీ మూవీకి ఈసీ బ్రేక్
మరో వైపు మంగళవారం సాయంత్రం 5 గంటల 55 నిమిషాల దాకా ప్రచారం చేసిన చంద్రబాబు , సాయంత్రం 6 గంటల సమయంలో సీఎం లెటర్ హెడ్ పై 6 పేజీల లేఖ విడుదల చెయ్యటం పట్ల కూడా వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణతో, చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరనున్నారు.
Read Also : ఏప్రిల్-11కు ఏర్పాట్లు పూర్తి…. పోలింగ్ జరగనున్న స్థానాలివే