ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుంది
విశాఖ : ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అని జగన్ ఆరోపించారు.

విశాఖ : ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అని జగన్ ఆరోపించారు.
విశాఖ : ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పార్లమెంటులో పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. గాజువాకలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు హయాంలో కుంభకోణాలు పెరిగిపోయాయని అన్నారు. కొండలు, గుట్టలు, ప్రైవేటు ఆస్తులు ఏవీ వదిలి పెట్టలేదన్నారు. విశాఖను చంద్రబాబు అన్ని విధాలుగా దిగజార్చారని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనంతా మోసం, అబద్దాలే అని జగన్ అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని.. బాబు సీఎం అయ్యాక ఉన్న ఉద్యోగాలు కూడా ఊడాయని చెప్పారు. భాగస్వామ్య సదస్సు కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేసిందని, సదస్సు ద్వారా లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారని.. ఎవరికైనా జాబ్ వచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రైవేటు విశ్వవిద్యాలయాలనే ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేజీహెచ్ ఆస్పత్రిలో వసతులు సరిగా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ వాపోయారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్ లో యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఉద్యోగాలు ఇస్తామని జగన్ చెప్పారు. విశాఖలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, ప్రభుత్వ భూములను చంద్రబాబు తన అనుచరులకు అప్పనంగా కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ నిర్వాసితులకు 50శాతం ఉద్యోగాలు ఇవ్వాలని దివంగత వైఎస్ చట్టం తెచ్చారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఆ చట్టాన్ని తుంగలో తొక్కారని జగన్ మండిపడ్డారు.