జగన్ నా అన్న.. నా రక్తం : మంచు ఫ్యామిలీ వీరవిధేయత

  • Published By: vamsi ,Published On : March 25, 2019 / 06:45 AM IST
జగన్ నా అన్న.. నా రక్తం : మంచు ఫ్యామిలీ వీరవిధేయత

Updated On : March 25, 2019 / 6:45 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ మంచు కుటుంబం, తెలుగుదేశం నాయకులకు మధ్య మాటల వార్ నడుస్తుంది. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు పెద్ద కోడలు విష్ణూ భార్య మంచు విరానిక తన మద్దతును వైసీపీకి ప్రకటించింది. తన బంధువైన వైఎస్ జగన్‌కు మేలు చేసేందుకే మోహన్ బాబు.. ఎన్నికల సమయంలో రోడ్లపైకి వచ్చి నాటకాలు వేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మోహన్‌బాబు వారం రోజులుగా చెవిరెడ్డి అనే క్రిమిన‌ల్‌తో తిరుపతిలో తిరుగుతున్నారని, ముసుగు తీసి వైసీపీకి సపోర్ట్ చేయవచ్చు కదా? అని మోహన్ బాబును టీడీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ చేస్తోన్న విమర్శలు, ఆరోపణలపై మంచు విరానికా స్పందించారు.

“అసలు మంచు ఫ్యామిలీ వైసీపీకి ఎందుకు మద్దతు ఇవ్వకూడదని విరానిక ప్రశ్నించారు. ‘నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నానని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అసలు నేనెందుకు మద్దతివ్వకూడదు? ఒకవేళ మీకు దీనిపై స్పష్టత లేకపోతే, మీకు కొన్ని విషయాలు చెబుతాను. వైఎస్ జగన్.. నా అన్న, నా రక్తం. ఇక నా విషయానికి వస్తే, నాకెప్పుడూ నా కుటుంబమే ముఖ్యం’ అంటూ ట్వీట్ చేసింది. #APneedsYSJagan #VoteForFan అనే యాష్ ట్యాగ్‌లను కూడా ఆమె తన ట్వీట్‌కు జత చేశారు.