TikTok ట్రెండింగ్: కరీనా, కత్రినాలను పోలిన అమ్మాయిలు

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు.. ఇది నిజం, కావాలంటే మీరే చూడండి. టిక్ టాక్ యాప్ ద్వారా చాలామంది సెలెబ్రిటీలను పోలిన వ్యక్తులు బయటకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీలు కత్రినా కైఫ్, కరీనా కపూర్, మధుబాలా, దీపికా పదుకొనే లను పోలిన అమ్మాయిల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కత్రినా కైఫ్ కు జిరాక్స్ :
కత్రినా పోలికలతో ఉన్న ఓ అమ్మాయి టిక్ టాక్ లో సందడి చేస్తోంది. కత్రినాకు జిరాక్స్ కాపీలా ఉన్న ఈమెపేరు ‘Alina Rai’. ఈమె టిక్‌టాక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు కత్రీనా ట్రెండింగ్ స్టయిల్ ఫాలో అవుతూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
కరీనా కపూర్ :
ఈ అమ్మాయి పేరు ‘Shanaya Sachdeva’. టిక్ టాక్ లో ఈమె చేసిన వీడియాలను చూస్తే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. తన ఎక్స్ ప్రెషన్స్, యాక్షన్ అన్నీ కరీనా కపూర్ లాగానే చేస్తుంది. అసలు కొంచెం కూడా డిఫరెంస్ కనిపించదు. వీడియోలో పాటలతో పాటు డైలాగ్ లు చెబుతున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
దీపికా పదుకొనే :
ఈ అమ్మాయి పేరు ‘KinjalMore’. టిక్ టాక్ లో ఈ ముద్దుగుమ్మ చేసే వీడియోలు చూసి అందరూ.. నువ్వు అచ్చం దీపికా పదుకొనే లాగానే యాక్షన్ చేస్తున్నావ్ అని కమెంట్లు పెడుతున్నారు. తను చేసే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తున్నాయి. తను అచ్చం దీపికా లాగా లేకపోవచ్చు కానీ తను చేసే యాక్షన్ మాత్రం పర్ఫెక్ట్ గా దీపికా లాగానే చేస్తోంది. ఆమె ఒక్కో వీడియోను వేల మంది లైక్ చేయడం విశేషం.
మధుబాలా:
ఈ అమ్మాయి పేరు ‘Priyanka Kandwal’. ఈమె టిక్ టాక్ లో అలనాటి తార మధుబాలా గెటప్ లో అందరినీ అలరిస్తోంది. అచ్చం మధుబాలా గెటప్ వేసుకుని తిను చేస్తున్న వీడియోలకు టిక్ టాక్ లో 1.8 మిలియన్‌కు పైగా లైక్‌లు వచ్చాయి.