ఇన్‌స్టాలో సెలబ్రిటీల ఫొటోలు.. సుహానా ఖాన్, అషిమ్ రియాజ్, హినా ఖాన్

బాలీవుడ్ సెలబ్రిటీల ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ వంటి అకౌంట్లలో ఎప్పటికప్పుడూ యాక్టివ్ గా ఉంటుంటారు… తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ నుంచి అషీమ్ రియాజ్, హినా ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలు తమ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్
వేదికగా ఫొటోలను షేర్ చేశారు.
ఇప్పుడీ ఈ ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందులోనూ బక్రీద్ పర్వదినాన తమ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తు అభిమానులను అలరిస్తున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తన ‘బేబీ లూయిస్ విట్టన్’ను తన కొత్త ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో ట్రెండ్ అవుతోంది.
అసిమ్ రియాజ్ తన అభిమానులకు “ఈద్ ముబారక్” శుభాకాంక్షలు తెలిపాడు. తన బ్లూ కార్ ముందు స్టయిలీష్ డ్రస్‌లో నిలబడి దిగిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేశాడు.
హినా ఖాన్ ఈద్ సందర్భంగా అందరూ బాగుండాలని తన అభిమానులను కోరుకున్నారు. సలాం చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది.
మరో ముద్దుగమ్మ కియారా అద్వానీ తన ఫొటోను షేర్ చేసింది. తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ప్రేమతో నిండిన హృదయంతో మీ దీవెనలు నాకు అందాయని భావిస్తున్నాను.. అంటూ ఫొటోను షేర్ చేసింది. తనకు బర్త్ డే విషెస్ చెబుతూ వీడియోలు, మెసేజ్ లు, కాల్స్ చేసి చెప్పిన అభిమానులు సహా ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.
సోహా అలీ ఖాన్, కునాల్ కెమ్ము శుక్రవారం సాయంత్రం డిస్నీ + హాట్‌స్టార్‌లో లూట్‌కేస్ వీక్షిస్తూ ఫొటోకు ఫోజిచ్చారు. ఇప్పుడీ ఫొటోను తమ ఇన్ స్టాలో అభిమానులతో పంచుకున్నారు.
అనుభవ్ సిన్హా తన పుట్టినరోజున తాప్సీ పన్నూ శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలో మహిరా శర్మ క్యూట్‌గా కనిపించింది. మంచు ప్రదేశంలో కూర్చొని ఉన్నట్టుగా ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.
హాట్ లేడీ… సారా అలీ ఖాన్ తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఈ ఫొటో కూడా ట్రెండ్ అవుతోంది. అభిమానులు చూసి ఫిదా అయిపోతున్నారు.