తోక గుడ్డు…ఇది ఎక్కడా చూసి ఉండరు

కోడికి తోక ఉంటుంది, కోడి పిల్లకి తోక ఉంటుంది, మరి కోడి గుడ్డుకు...? 

తోక గుడ్డు…ఇది ఎక్కడా చూసి ఉండరు

Egg Tail

Updated On : May 18, 2021 / 12:23 PM IST

తూర్పుగోదావరి : కోడి గుడ్డుకు ఎక్కడైనా తోక ఉంటుందా…తూర్పుగోదావరి జిల్లా కరప మండలం రాయుడు సుబ్రహ్మణ్యం ఇంట్లో ఓ కోడి పెట్టిన గుడ్డుకు తోక ఉంది. వింతగా ఉండటంతో దీనిని చూసేందుకు గ్రామస్తులు అంతా క్యూ కట్టారు. కానీ ఇలా కోడి గుడ్డుకు తోక రావడం వల్ల ఊరికి ఏమైనా అరిష్టం జరుగుతుందేమో అని గ్రామస్తులు బయపడుతున్నారు. వాళ్లలో కొంతమంది ఇది బ్రహ్మంగారు ముందే చెప్పారంటు తోక ఉన్న గుడ్డును రామాలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో అన్ లైన్ లో వైరల్ అవుతుంది.