బురద ప్రేమ: వింత ఫొటో షూట్ ఇలా కూడా చేస్తారా..

బురద ప్రేమ: వింత ఫొటో షూట్ ఇలా కూడా చేస్తారా..

Updated On : November 24, 2019 / 1:09 PM IST

పెళ్లిళ్లకు చేస్తున్న ఫొటో షూట్‌లో వస్తున్న కొత్త ట్రెండ్.. హద్దుల్లేకుండా తయారైంది. లేని అందాలను సృష్టించి ఫొటోషూట్ చేస్తే ఓకే. కానీ, బురదలో దొర్లుతూ దానికి మడ్ లవ్ అనే పేరు పెట్టడంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇటీవల ఓ జంట పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని చేసిన పోస్టు వైరల్ గా మారింది. 

2వేల మందికి పైగా రీ ట్వీట్ చేయడంతో పాటు కామెంట్లు వరద పారుతోంది. కొద్ది రోజుల తర్వాత ఎలాగూ బురదలోనే దొర్లాలి. పెళ్లికి ముందు బురద వెతుక్కోవాలి కానీ, పెళ్లి తర్వాత బురదలో ఉన్నట్లే మళ్లీ బురద ఫొటోషూట్ ఎందుకు. ఇదొక మహా అద్భుతం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. 

ఈ ఫొటో షూట్ లో వారిద్దరూ కూర్చొని, ఒకరి మీద ఒకరు పడుకుని, బోర్లా పడుకుని ఉన్న ఫొటోలు ఉన్నాయి. నారుమడిలో దొర్లుతూ ఫొటోలు దిగడాన్ని కూడా వెక్కిరిస్తూ కామెంట్లు వస్తున్నాయి.