మహిళ పొట్టపై ఎన్ని తేనేటీగలో చూశారా… ఫోటో వైరల్

  • Published By: Chandu 10tv ,Published On : July 6, 2020 / 01:59 PM IST
మహిళ పొట్టపై ఎన్ని తేనేటీగలో చూశారా… ఫోటో వైరల్

Updated On : July 6, 2020 / 3:41 PM IST

సాధారణంగా అందరూ పెళ్లిళ్లకి పుట్టిన రోజులకు ఫోటోలు, ఫోటోషూట్ లు తియించుకునేవారు. ఆయితే ప్రస్తుతం మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్న జంట బేబీ షవర్ మెటర్నిటీ ఫోటో షూట్ వంటి వింత వింత కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ ఫోటో షూట్ కోసం అందమైన, ఆకర్షించే ప్రదేశాలకు వెళ్లి ఫోటోషూట్ ఎంతో రిచ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే టెక్సాస్ కు చెందిన ఓ మహిళ మాత్రం తన మెటర్నిటీ ఫోటోషూట్ కోసం పెద్ద సాహసమే చేసింది. అదేంటంటే… తన పొట్ట పై ఏకంగా పదివేల తేనెటీగలను పెట్టుకొని ఫోటోషూట్ కు ఫోజులు ఇచ్చింది. ఆమె పేరు బేతని కరులక్.

అంతేకాదు ఈమె ఇటీవలే ఫోటో షూట్ లకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే నేను చేసాకదా అని ఎవరు అనుభవం లేకుండా ప్రయత్నించకండి. అది చాలా ప్రమాదకరం అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటో చూసిన నెటిజన్ల అంతా మీ సాహసానికి ఫిదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read Here>>స్పానిష్‌ ఫ్లూ కాలంలో 4ఏళ్లున్న బాలుడు..ఇప్పుడు కరోనాను జయించిన 106 ఏళ్ల యోధుడు