OMG.. పాముతో స్కిప్పింగ్ ఆడిన చిన్నారులు

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 02:24 AM IST
OMG.. పాముతో స్కిప్పింగ్ ఆడిన చిన్నారులు

Updated On : November 20, 2019 / 2:24 AM IST

పామును చూస్తేనే చాలు చాలా మంది ఆమడ దూరం పరిగెత్తుతారు. అలాంటిది ఆ చిన్నారులు మాత్రం దాన్ని తాడులా పట్టుకుని స్కిప్పింగ్  ఆడారు. ఈ వింత ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. ఇది వినడానికి నిజమేనా అనిపిస్తుంది కదూ. అవును ఇది నిజం.. ఆ ముగ్గురు పిల్లలు ఏ మాత్రం భయపడకుండా పామును అటూ ఇటూ తాడును తిప్పినట్లు తిప్పడం చూస్తే వామో అనిపిస్తుంది. 

ఈ చిన్నారులు  పట్టుకున్నది ఏదో చిన్నాచితక పాము కాదండోయ్ ఆ చిన్నారుల కంటే ఆ పాముపొడవు గానే ఉంది. ఇక పిల్లలు అలా పాముతో ఆడుతుంటే అక్కడే ఉన్న ఓ మహిళ వారిని తిట్టకుండా.. ఇంకా ఎంకరేజ్ చేయడం విషేశం.

అసలు విషయమేంటంటే.. ఆ పాము చనిపోయిందని అక్కడి మహిళ ఈ వీడియో పోస్టు చేసిన వ్యక్తికి చెప్పింది. పాము బతికున్న చచ్చిపోయిన పాము తో ఆట ఆడటం ఏంటి అని పలువురు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అంతేకాదు ఈ వీడియోను ఇప్పటివరకు 96 వేల మంది వీక్షించారు.