అరకు పిలుస్తోంది.. ఫెస్టివల్‌కు పోదాం రండి

అరకు ఎన్టీఆర్ గ్రౌండ్లో శనివారం (ఫిబ్రవరి 29)న అరకు ఉత్సవ్-2020 ప్రారంభం కానుంది. ఈ ఉత్సవం రెండురోజులు (ఫిబ్రవరి 29, మార్చి 1) జరగనుంది. ఈ ఉత్సవాన్ని ప్రతీ సంవత్సరం గిరిజనుల అభివృద్ధి, ఆనందం కోసం నిర్వహిస్తారు. ఇక్కడ గిరిజన వంటకాలన్నీటిని రుచి చూడవచ్చు. గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా రెండు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
అందమైన వాతావరణం, పచ్చని కొండలు, కొండ లోయలు, సముద్ర తీరం ఇలా చెప్పుకుంటేపోతే అరకు అందాలకు ఎన్నో ఉంటాయి. మరి అంత అత్యద్భుతంగా ఉండే అరకుకు వచ్చిన పర్కటకులు గిరిజనుల జీవనశైలి, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవచ్చు.
ఈ ఉత్సవాలకు వచ్చే దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. అయితే, అరకు ఉత్సవ్ లో గతేడాది నిర్వహించిన హాట్ బెలూన్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. అందుకని ఈసారి కూడా డిఫరెంట్స్ థీమ్స్‌తో పర్యాటకులను అలరించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.