Telangana : ఒకవైపు వానలు, మరోవైపు వడగాలులు

తెలంగాణాలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

weather forecast

Telangana : తెలంగాణాలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎల్లుండి తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వారు వివరించారు. వానలు కురిసే ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈరోజు ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో మరియు రేపు ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల జిల్లాలలో వడగాల్పులు అక్కడక్కడా వీచే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలిపారు.

తూర్పు మధ్యప్రదేశ్ నుండి రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు చత్తీస్‌ఘడ్ నుంచి కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సముద్ర మట్టం నుండి 1.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని అధికారులు అన్నారు.

Also Read : Andhra pradesh : ‘తోసి పడేస్తా జాగ్రత్త’ పోలీసులపై సోము వీర్రాజు వీరంగం..