Interesting Facts : ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేసే డాక్టర్లు.. గ్రీన్, బ్లూ కలర్ డ్రెస్ ఎందుకు ధరిస్తారో తెలుసా? అసలు రీజన్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Interesting Facts : ప్రతిఒక్కరిలో లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఆస్పత్రికి వెళ్లే ఉంటారు. అయితే, అక్కడ సాధారణంగా గ్రీన్ కలర్ కటన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే, బ్లూ కలర్ కూడా ఉంటాయి.

Interesting Facts : ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేసే డాక్టర్లు.. గ్రీన్, బ్లూ కలర్ డ్రెస్ ఎందుకు ధరిస్తారో తెలుసా? అసలు రీజన్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Blue-Green-Dress-Code

Interesting Facts : ప్రతిఒక్కరిలో లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఆస్పత్రికి వెళ్లే ఉంటారు. అయితే, అక్కడ సాధారణంగా గ్రీన్ కలర్ కటన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే, బ్లూ కలర్ కూడా ఉంటాయి. ఇంతకీ, ఆస్పత్రిలో ఇతర ఏ రంగులను కాకుండా కేవలం గ్రీన్ కలర్, బ్లూ కలర్ మాత్రమే ఎందుకు వినియోగిస్తారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ.. తెలుసుకునేందుకు ప్రయత్నించారా? ప్రత్యేకించి ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేసే సమయంలో వైద్యులు సైతం గ్రీన్ కలర్ డ్రెస్ ధరిస్తుంటారు. మరికొన్ని సార్లు బ్లూ కలర్ డ్రెస్ కూడా ధరిస్తారు.. ఇలా ఎందుకు ధరిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోయాపోవాల్సిందే.. దీనికి వెనుక కూడా ఒక సైన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Interesting Facts : Why Doctors Wear Green Clothes While Performing Surgery, Do You Know Reason And Facts

Interesting Facts : Why Doctors Wear Green Clothes While Performing Surgery

సాధారణంగా మనం బయటి వెలుతురు ప్రదేశంలో నుంచి చీకటి గదిలోకి ప్రవేశించిన సమయంలో కళ్లు ఒక్కసారిగా మసకబారుతుంటాయి. అప్పుడు ఆ గదిలో ఉండే ప్రదేశాన్ని స్పష్టంగా చూడలేం.. అప్పుడు గ్రీన్ కలర్ లేదా బ్లూ కలర్ కనిపిస్తే కళ్లకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇతర కలర్లలో రెడ్ లేదా మరి ఏదైనా కనిపిస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేగానీ, గ్రీన్ లేదా బ్లూ కలర్ ఉంటే గుడ్ ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఆపరేషన్ థియేటర్‌లో డాక్టర్లు గ్రీన్ కలర్ డ్రెస్ ధరిస్తుంటారు.

Read Also : Tech Tips : మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఇలా చేయండి.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!

ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కూడా అలాంటి అనుభూతినే పొందుతారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ (Quora)లో, సోషల్ మీడియా యూజర్లు ఇలాంటి ప్రశ్నలపై ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివిన వికాస్ మిశ్రా అనే వ్యక్తి.. ఆకుపచ్చ (Green), నీలం (Blue) రంగులు ఇతర రంగులకు విరుద్ధంగా ఉంటాయని సమాధానమిచ్చాడు. అందుకే ఆపరేషన్ సమయంలో సర్జన్ దృష్టి ఎక్కువగా ఎరుపు రంగులపై మాత్రమే కేంద్రీకృతం అవుతుంది. ధరించిన క్లాత్ ఆకుపచ్చ లేదా నీలం రంగులు సర్జన్ చూడగల సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎరుపు రంగు ప్రభావానికి గురికాకుండా ఉండేలా చేస్తాయి.

Interesting Facts : Why Doctors Wear Green Clothes While Performing Surgery, Do You Know Reason And Facts

Interesting Facts : Why Doctors Wear Green Clothes While Performing Surgery

ప్రపంచంలోనే ఫస్ట్ సర్జన్ ఆయనే.. :
టుడేస్ సర్జికల్ నర్స్ 1998 ఎడిషన్‌లో ఇటీవల ఒక నివేదిక పబ్లీష్ అయింది. ఈ నివేదిక ప్రకారం.. గ్రీన్ కలర్ డ్రెస్ ధరించడం ద్వారా సర్జరీ సమయంలో కంటికి కొంత రిలీఫ్ అందిస్తుంది. ఢిల్లీలోని BLK సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఆంకాలజిస్ట్ డాక్టర్ దీపక్ నైన్ ప్రకారం.. ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్‌గా పేరుగాంచిన ఆయన ఆయుర్వేదంలో సర్జరీ సమయంలో ఆకుపచ్చ రంగును ఉపయోగించడం గురించి చెప్పారు. ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. సర్జరీ సమయంలో వైద్యులు తరచుగా బ్లూ, వైట్ యూనిఫాంలను కూడా ధరిస్తారు. కానీ, రక్తపు మచ్చలు వాటిపై పడినా గోధుమ రంగులో కనిపిస్తాయి.

Interesting Facts : Why Doctors Wear Green Clothes While Performing Surgery, Do You Know Reason And Facts

Interesting Facts : Why Doctors Wear Green Clothes While Performing Surgery

గ్రీన్ డ్రెస్ కోడ్ తీసుకొచ్చింది ఎవరంటే? :
అందుకే ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. వైద్యులు చాలా కాలం పాటు బ్లూ లేదా గ్రీన్ యూనిఫాం ధరిస్తున్నారు. కానీ, వైద్యులు ఎప్పుడూ ఇదే రకం యూనిఫాం ధరించారని అర్థం కాదు. గతంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అంతా తెల్లటి యూనిఫాం ధరించేవారు. కానీ, 1914లో ఒక వైద్యుడు తెల్ల రంగు యూనిఫాంను కాస్తా ఆకుపచ్చ రంగులోకి మార్చాడు. అప్పటి నుంచి ఈ సర్జరీ డ్రెస్ కోడ్ట్రెండింగ్‌గా అయింది. చాలావరకూ ఈ రోజుల్లో, కొంతమంది వైద్యులు సైతం బ్లూ కలర్ వంటి దుస్తులు ధరించి సర్జరీలు చేయడం చూస్తున్నా. ఏదిఏమైనా.. సర్జరీ సమయంలో వైద్యులు గ్రీన్ లేదా బ్లూ కలర్ డ్రెస్ కోడ్ మాత్రమే ఎందుకు ధరిస్తారు అనడానికి సైంటిఫిక్ రీజన్ అయితే ఇదే అనమాట..

Read Also : Most Congested City in India: మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఏదో తెలుసా?