Michael Jackson: లోకల్ మైకెల్.. తిరిగే నీ పార్టులు మెలికల్

హడావుడి లేని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే వ్యక్తి డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చూస్తే ఎవ్వరూ అంచనా వేయలేరు. కానీ, అతని స్టెప్పులు వాటికొస్తున్న లైకులు మాత్రం వేరే లోకానికి...

Michael Jackson: లోకల్ మైకెల్.. తిరిగే నీ పార్టులు మెలికల్

Local Micheal Jackson

Michael Jackson: డ్యాన్స్ అంటే మైకేల్ జాక్సన్ పేరే చెప్తారు. ఆయన ఇన్‌స్పిరేషనో.. సెల్ఫ్ మోటివేషనో.. ఈ గల్లీ జాక్సన్ స్టెప్పులు చూసి ఎవరైనా నోరు తెరిచిచూస్తారు. మైకెల్ జాక్సన్ డేంజరస్ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసి రోడ్ మీద వెళ్లేవారిని నోరెళ్లబెట్టేలా చేశాడు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదంటూ.. మైకెల్ జాక్సన్ తాతలా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పాప్ సింగర్ మైకెల్ నుంచి 1991లో రిలీజ్ అయిన డేంజరస్ ఆల్బమ్.. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో రికార్డ్ సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జనరేషన్లు మారినా.. పాట క్రేజ్ తగ్గడం లేదు.

ఏ మాత్రం హడావుడి లేని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే వ్యక్తి డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చూస్తే ఎవ్వరూ అంచనా వేయలేరు. కానీ, అతని స్టెప్పులు వాటికొస్తున్న లైకులు మాత్రం వేరే లోకానికి తీసుకెళ్తున్నాయి. నడిరోడ్డుపై నిల్చొని పక్క నుంచి వాహనాలు పోతున్నా.. ఏకాగ్రత చెదిరిపోకుండా డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు.

……………………………………………………….: ప్రకాష్ రాజ్ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా.. పూనమ్ ట్వీట్!

అందులో మళ్లీ మూమెంట్స్ కూడా యాడ్ చేశాడు. బౌలింగ్ వేసే స్టైల్ ని కూడా డ్యాన్స్ చేసి, బ్యాట్స్‌మన్ లా షాట్ కొట్టి, మరో వైపు దానిని క్యాచ్ అందుకున్న ఫీల్డర్ లా సెలబ్రేట్ చేసుకున్నట్లు మూమెంట్లు చేశాడు.