ఖమ్మం పంచాయతీ : చెదురుముదురు ఘటనలు

  • Published By: madhu ,Published On : January 25, 2019 / 09:16 AM IST
ఖమ్మం పంచాయతీ : చెదురుముదురు ఘటనలు

ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెండోదశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 168, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మేజర్ గ్రామ పంచాయతీలలో కోటి రూపాయలు నుండి రెండు కోట్ల రూపాయలు వరకు అభ్యర్థులు ఖర్చు చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం కోయగూడెంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరిగాయి.  ఎంఎల్ఏ బాణోత్ హరిప్రియను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా టిఆర్ఎస్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు తల్లాడ మండలం అన్నారు గూడెం, కల్లూరులలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో 73.3% ఓటింగ్ నమోదు అయినట్లు అంచనా.