కేబినెట్ మీటింగ్ పెడతా.. ఎలా రారో చూస్తా : అధికారుల తీరుపై చంద్రబాబు

  • Published By: madhu ,Published On : May 3, 2019 / 12:50 PM IST
కేబినెట్ మీటింగ్ పెడతా.. ఎలా రారో చూస్తా : అధికారుల తీరుపై చంద్రబాబు

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరుగనుంది. అయినా..ఇప్పటికీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సంఘం, సీఎస్..బాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మాట వినని అధికారులతో తాడో పేడో తేల్చుకోవడానికి బాబు రెడీ అయిపోతున్నారు. నాలుగైదు రోజుల్లో కేబినెట్ సమావేశం పెడుతున్నట్లు, బిజినెస్ రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా ఊరుకోనని..కఠిన నిర్ణయాలు తీసుకుంటానని అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

మే 03వ తేదీన బాబు మీడియాతో మాట్లాడారు. అధికారులూ హద్దులు దాట కూడదన్నారు. సోమవారం పోలవరంలో పర్యటిస్తానని, ఏపీ రాష్ట్ర సీఎస్ ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడడం లేదని..వేరే రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతుందా అంటూ ప్రశ్నించారు. తాను జరిపే మీటింగ్‌కు అధికారులు వస్తారా ? లేదా ? అనేది చూస్తానన్నారు. ఎన్నికల కోడ్ సాకును చూపెడుతూ అధికారులు బాధ్యతగా వ్యవహరించడం లేదంటూ విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉందంటూ..బాబు రివ్యూలు చేయకూడదంటూ ఎన్నికల సంఘానికి కొన్ని కంప్లయింట్స్ అందాయి. దీనితో బాబు ఇంటికే పరిమితమవుతున్నారు.