కర్నూల్ లో హైకోర్ట్ బెంచ్ : చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 09:39 AM IST
కర్నూల్ లో హైకోర్ట్ బెంచ్ : చంద్రబాబు

కర్నూలు: కర్నూల్ లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత  రాజధానిని కర్నూల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినా అమరావతిలోనే రాజధానికి ఏర్పాటు చేయటం..కొంత వివాదంగా మారినా అది రాను రాను సద్దుమణిగిపోయింది. ఈ క్రమంలో ఉమ్మడి హైకోర్టు ఏపీలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మరోసారి  ఈ వివాదం తెరపైకి వచ్చింది. హైకోర్టును, రాజధానిని ఆంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం పట్ల రాయలసీమ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చంద్రబాబు ఎట్టకేలకు దిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. 

కోస్గి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి – మాఊరు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు గళవారంనాడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జలధార ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో 97 లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన రెండు త్వరలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి అమరావతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు విమాన సర్వీసులు కూడా వుంటాయని తెలిపారు. అంతేకాదు ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్‌గా మారుతుందని..200 ప్రముఖ కంపెనీలు ఓర్వకల్లుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గని అల్ట్రా మెగా పవర్‌ సోలార్ పార్కు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రాజెక్టు అని చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో కర్నూలు ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.