ప్రభుత్వ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

  • Published By: vamsi ,Published On : March 10, 2020 / 12:57 PM IST
ప్రభుత్వ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళనే లక్ష్యంగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్య ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న జగన్.. డిజిటల్ విద్యకు పెద్ద పీట వేయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రతి ప్రభుత్వ పాఠశాలకు స్మార్ట్ టీవీని అందించాలని అధికారులకు సూచనలు చేశారు.

ప్రతి పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం వరకు స్మార్ట్ టీవీలు ఉండాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే ‘జగనన్న విద్యా దీవెన’ పథకంపై పలు దఫాలుగా విద్యాశాఖ అధికారులతో చర్చించిన జగన్.. మళ్లీ స్కూళ్లు తెరిచే నాటికి అన్నీ స్కూళ్లలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. 

విద్యాకానుకకు సంబంధించిన పలు నమూనాలను సీఎంకు చూపించారు అధికారులు. కిట్‌లో మూడు జతల యూనిఫామ్స్‌తో పాటు బ్యాగ్, బూట్లు, సాక్సులు, బెల్ట్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఉండాలని జగన్ వారికి సూచనలు చేశారు. విద్యార్థులకు పంపిణీ చేసే వస్తువులు నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్ల రూపురేఖలు మార్చాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు.