సీఎం జగన్ సంచలన ప్రకటన : ప్రతీ బుధవారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు

  • Published By: vamsi ,Published On : October 15, 2019 / 08:11 AM IST
సీఎం జగన్ సంచలన ప్రకటన : ప్రతీ బుధవారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు

అన్నా బాగున్నావా .. అక్కా బాగున్నావా.. వర్షాలు బాగా పడ్డాయా.. సోమశిల నిండిందా అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన సీఎం జగన్.. ఒక రైతుబిడ్డగా వైయస్ఆర్ రైతుభరోసా పథకాన్ని నెల్లూరు జిల్లా వేదికగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతు బిడ్డగా నెల్లూరుకు రావడం ఆనందంగా ఉందని, దేశంలో ఏ రాష్ట్రం రైతులకు ఇవ్వని విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు అన్నారు.

తన పాదయాత్రలో రైతుల కష్టాలు ఉన్నామని వారి బాధలు కళ్లారా చూశానని, అప్పుడు రైతుల బాధలు విన్నాను అని, ఇప్పుడు నేను ఉన్నాను అని వాళ్లకు భరోసా ఇచ్చేందుకే ఈ కార్యక్రమం అని జగన్ అన్నారు. గ్రామగ్రామాన రైతుల కష్టాలను చూశానని, వర్షాలు లేక కొందరు, పెట్టుబడి సాయంలేక మరికొందరు పడుతున్న ఆవేదనను చూసి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు సీఎం జగన్.

ప్రతీ ఏటా రైతులకు మూడు విడతలుగా రూ.13,500 రూపాయలు చెల్లిస్తున్నానని, వ్యవసాయ కమిషన్ లోని సభ్యులు, ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు చెప్పిన దానికన్నా 8 నెలలు కన్నా ముందుగానే రైతు భరోసా పథకాన్ని అమలులోకి తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సరంలో ఖరీఫ్ పంట వేసే టైమ్‌కి మే నెలలోనే రూ.7,500 అలాగే అక్టోబర్ లో రూ.4వేలు అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా రూ.2వేలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

బుధవారం నుంచి నేరుగా అకౌంట్లోకి డబ్బులు పడుతాయని, నవంబర్ 15వ తేదీ వరకు ఇంకా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతీ బుధవారం రైతుల అకౌంట్లో డబ్బులు పడుతాయని చెప్పారు జగన్.