లొంగిపోయిన వెంకటేశ్.. రెండో వివాహానికి సిద్ధమైనందుకే చంపానని స్టేట్‌మెంట్

లొంగిపోయిన వెంకటేశ్.. రెండో వివాహానికి సిద్ధమైనందుకే చంపానని స్టేట్‌మెంట్

దివ్య హత్యకేసులో నిందితుడైన వెంకటేశ్ తనకు తానుగా లొంగిపోయాడు. వేములవాడ స్టేషన్‌లో లొంగిపోయిన వ్యక్తిని సిరిసిల్లకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి గజ్వేల్ కు తీసుకురానున్నారు. పోలీసుల ఎదుట తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. సిరిసిల్లా జిల్లా.. ఎల్లారెడ్డిపేటలో అంత్యక్రియలు ముగిసిన కాసేపటి తర్వాత ఈ ఘటన జరిగింది. దివ్య తనను మోసం చేసేందుకు సిద్ధం అవడంతో హత్య చేశానన్నాడు వెంకటేశ్. 

అతని తండ్రి మాట్లాడుతూ.. గతంలోనే దివ్యకు తన కొడుకుకు వివాహం జరిగిందని చెప్పారు. ఎనిమిదో తరగతి నుంచి ప్రేమలో ఉన్నారని.. చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. వివాహం తర్వాత తామే హాస్టల్ లో ఉంచి చదవించామని చెప్పారు. కూతురు బ్యాంకు ఉద్యోగం సంపాదించి ప్రయోజకురాలు అయిన తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. 

వరంగల్ కు చెందిన వ్యక్తితో గత నెల 26న మరోసారి వివాహం చేసేందుకు మాటలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. హత్య చేయడానికి వెనుక కారణాల గురించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గజ్వేల్ లోని దివ్య నివాసం వద్దకు తీసుకొచ్చి కేస్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.