రాష్ట్రాన్ని ముంచే సీఎం: జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం : దేవినేని  

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 09:22 AM IST
రాష్ట్రాన్ని ముంచే సీఎం: జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం : దేవినేని  

ఏపీ సీఎం జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం అని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.6వేల కోట్ల నష్టం కలిగిలా పాలన చేసిన సీఎం జగన్ కు మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతానికి పడిపోయిందనీ..జగన్ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఆరు నెలల్లోనే రాష్ట్రానికి వచ్చే రూ.30వేల కోట్ల ఆదాయం పడిపోయిందన్నారు. అందుకే సీఎం జగన్ రూ.25వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారనీ విమర్శలు సంధించారు.
 
జగన్ ఆంధ్ర ప్రదేశ్ కు మంచి సీఎం కాదనీ రాష్ట్రాన్ని ముంచే సీఎం అని..వచ్చిన నష్టాలే దీనికి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కక్ష, వివక్షలే వైసీపీ ప్రభుత్వ ప్రధాన ఎజెండాలుగా చేసుకుని వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సామాన్యుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా జగన్ పాలన ఉందనీ..అతని విధానాలన్నీ అలాగే ఉన్నాయన్నారు.  

కాగా..సీఎం జగన్ సోమవారం (డిసెంబర్ 2)న ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రతీపక్ష నేతలు తన మతం గురించి పదే పదే మాట్లాడుతున్నారనీ దానికి నా సమాధానం ఇదే అంటూ ‘నా మతం మానవత్వం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంమే నా కులం’ అని అన్నారు. ఈ క్రమంలో జగన్ అన్న ఈ మాటలపై స్పందించని దేవినేని జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం అంటూ ఎద్దేవా చేశారు.