నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం : బహిరంగ మల విసర్జన చేసిన వ్యక్తికి రూ.500 జరిమానా

ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా వినిపించుకోవడం లేదు. అలా చేయడం తప్పు అని నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోవడం లేదు. అదే నిర్లక్ష్యం. ఇక లాభం లేదని డిసైడ్ అయిన

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 03:05 AM IST
నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం : బహిరంగ మల విసర్జన చేసిన వ్యక్తికి రూ.500 జరిమానా

ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా వినిపించుకోవడం లేదు. అలా చేయడం తప్పు అని నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోవడం లేదు. అదే నిర్లక్ష్యం. ఇక లాభం లేదని డిసైడ్ అయిన

ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా వినిపించుకోవడం లేదు. అలా చేయడం తప్పు అని నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోవడం లేదు. అదే నిర్లక్ష్యం. ఇక లాభం లేదని డిసైడ్ అయిన అధికారులు జరిమానాలు మొదలుపెట్టారు. బహిరంగ మల విసర్జన చేసిన వ్యక్తిపై కొరడా ఝళిపించారు. బహిరంగ మల విసర్జన చేసినందుకు రూ.500 ఫైన్ వేశారు.

వివరాల్లోకి వెళితే.. సీఎం కేసీఆర్ 30 రోజుల గ్రామాల పంచాయతీ కార్యాచరణ శుక్రవారం(సెప్టెంబర్ 6,2019) నుండి మొదలైన సంగతి తెలిసిందే. ఈ కార్యాచరణలో భాగంగా పంచాయతీలలో ఎక్కడిక్కడ ప్రక్షాళన మొదలుపెట్టారు. పల్లెలను పట్టిపీడిస్తున్న దురాచారాలలో ఒకటైన బహిరంగ మల విసర్జన సమస్యపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. మంచిర్యాలలో మందమర్రి మండలం మామిడిగట్టులో పరిసరాల్లో మలవిసర్జన వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు అధికారులు. అయితే ఇంత చెప్పినా ఓ వ్యక్తి తప్పు చేశాడు. బహిరంగ మల విసర్జన చేశాడు. దీంతో అతడికి చెంబురాజు అనే బిరుదును ఇవ్వడంతో పాటు రూ.500 జరిమానా విధించారు. ఇక నారాయణపేట జిల్లాలో రోడ్డుపై కట్టెలు వేసినందుకు ఓ వ్యక్తికి రూ.5వేలు ఫైన్ విధించారు అధికారులు.

ఇకపై ఎవరూ ఇలాంటి తప్పు చేయకూడదని అధికారులు హెచ్చరించారు. బహిరంగ మల విసర్జన కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయని, వ్యాధులు ప్రబలుతున్నాయని అధికారులు వివరించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రావన్నారు. బహిరంగ మల విసర్జనకు ఫైన్ విధించడంతో స్థానికులు షాక్ అయ్యారు. అయితే ఇది మంచి పరిణామం అన్నారు. ఇలా జరిమానాలు వేస్తే కానీ జనాలు దారికి రారు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.