భారత సరిహద్దులో చైనాకు బర్రెలు..13 జడల బర్రెలు, 4 దూడల్ని అప్పగించిన భారత్

  • Published By: nagamani ,Published On : September 8, 2020 / 05:18 PM IST
భారత సరిహద్దులో చైనాకు బర్రెలు..13 జడల బర్రెలు, 4 దూడల్ని అప్పగించిన భారత్

భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని పరిస్థితుల్లో ఇరు దేశాల సరిహద్దుల్లో చైనా బర్రెలు భారత్ లోకి వచ్చాయి. వాటిని గమనించిన భారత్ జవాన్లు సామరస్యంగా స్పందించారు. గతం వారం లడాక్ లోని పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాలపై పట్టు కోసం రెండు దేశాల జవాన్లూ ప్రయత్నాలు జరుపుతున్నారు.


ఫింగర్ గాల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల వద్ద ఉద్రిక్త పరిస్థితి ఉన్న ఈ క్రమంలో కూడా ఇండియన్ ఆర్మీ మానవత్వం చాటుకుంటోంది. దారితప్పి ఇండియాలోకి వచ్చిన చైనీయులకు ఆశ్రయం కల్పించి మరుసటి రోజు చైనాకు పంపిన సంగతి తెల్సిందే.

తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనాకు చెందిన 13 జడల బర్రెలు, 4 దూడలను సంచరిస్తుండగా భారత జవాన్లు వాటిని గుర్తించారు. వాటిని చైనా సైన్యానికి అప్పగించారు. వీటిని స్వీకరించిన చైనా అధికారులు.. కృతజ్ఞతలు తెలిపారని ఈస్ట్రన్ కమాండ్ తెలిపింది.



“ఆగస్టు 31న ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖను దాటిఇవి తిరుగుతూ కనిపించాయి. వీటిని సెప్టెంబర్ 7న చైనా అధికారులకు అప్పగించాము” అని ఈస్ట్రన్ కమాండ్ తెలిపింది. కాగా..భారత్ పై అన్యాయంగా మండిపడుతున్న డ్రాన్ దేశం అయిన చైనా ఓ వైపు భారత్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే..మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతున్న విషయం తెలిసిందే.