ఎన్నికల సంఘంపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

  • Published By: vamsi ,Published On : March 15, 2020 / 07:54 AM IST
ఎన్నికల సంఘంపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘కరోనా’పై సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం జగన్‌.. నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ విశ్వభూషణ్‌తో సమావేశం అయ్యారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదా, కరోనా నివారణ చర్యలపై  గవర్నర్‌తో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. ఎటువంటి విచారణ లేకుండా అధికారులను బదిలీ చెయ్యడం.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను ఆరువారాలు వాయిదా వెయ్యడంపై అసహనం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. 

కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటిండంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.