చింతమనేని అంటే చంద్రబాబుకు భయం : మంత్రి అవంతి

  • Edited By: veegamteam , November 19, 2019 / 07:05 AM IST
చింతమనేని అంటే చంద్రబాబుకు భయం : మంత్రి అవంతి

చింతమనేని ప్రభాకర్‌ అంటే చంద్రబాబుకు భయం అని అందుకే సీఎంగా ఉన్నప్పుడు చింతమనేని బాబు మంత్రి పదవి ఇవ్వలేదనీ..మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంత్రి పదవి ఇవ్వని బాబు చింతమనేనికి జైలు నుంచి రాగానే పరామర్శించటానికి వెళ్లారనీ విమర్శించారు. 

ఈరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న మంత్రి అవంతి చంద్రబాబుపై ఈ విమర్శలు చేశారు. దుర్గమ్మను దర్శించుకుని రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నాను కానీ తప్పలేదని అవంతి అన్నారు. క్రెడెట్ ఎలా వచ్చినా..ఎప్పుడు వచ్చినా దక్కించుకునేందుక చంద్రబాబు ఏమాత్రం వెనుకాడరు..అందుకు చింతమనేనిని పరామర్శించి క్రెడిట్ కొట్టేయటానికి బాబు వెళ్లారని అన్నారు.

ఏదోక విషయాన్ని రాజకీయం చేయాలని ఎదురు చూసే బాబు విమర్శలు చేయటానికే ఉన్నట్లుగా ఉంటారనీ..ప్రస్తుతం ఏపీలో ఇసుక సమస్య తీరిపోయింది. అందుకే ఇప్పుడు తెలుగు భాష గురించి మాట్లాడుతున్నారని అన్నారు. సోషల్ మీడియా వేదికగా చేసే లోకేశ్ పిచ్చి మాటు మానుకోవాలనీ సూచించారు.