నిండుకుండలా నాగార్జున సాగర్

  • Published By: madhu ,Published On : August 25, 2019 / 01:48 AM IST
నిండుకుండలా నాగార్జున సాగర్

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండలాగా మారింది. ఈ ప్రాజెక్టు 2 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 81 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిన తర్వాత గేట్లను మూసివేశారు. అలల తాకిడి అధికంగా ఉండడంతో ప్రాజెక్టు గేట్లపై నుంచి నీరు కిందకు వెళుతోంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లోను దృష్టిలో ఉంచుకుని..క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో రావడం లేదని..రిజర్వాయర్‌లో 311.4474 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. 

మరోవైపు ఈ జలాశయం నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33 వేల 130 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వార 9 వేల 189 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8 వేల 896 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. SLBC ద్వారా 2 వేల 400, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డైవర్షన్ టన్నల్ ద్వారా 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 
Read More : రోగులకు గుడ్ న్యూస్ : ఆదివారాల్లోనూ ఓపీ సేవలు