పివి సింధు విజయంపై లోకేష్ ట్వీట్ వైరల్

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన పివి సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పివి సింధు దేశానికి గర్వకారణం అని కితాబిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 02:11 PM IST
పివి సింధు విజయంపై లోకేష్ ట్వీట్ వైరల్

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన పివి సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పివి సింధు దేశానికి గర్వకారణం అని కితాబిస్తున్నారు.

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన పివి సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పివి సింధు దేశానికి గర్వకారణం అని కితాబిస్తున్నారు. పలువురు ప్రముఖులు సింధుకి అభినందనలు తెలిపారు. సింధు విజయంపై టీడీపీ నేత, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఆయన కాస్త భిన్నంగా ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్ గా మారింది. సింధు విజయం వెనుక మాజీ సీఎం చంద్రబాబు విజన్ ఉందని లోకేష్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో క్రీడాకారుడు గోపీచంద్ కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరించారని చెప్పారు. ఇప్పుడా అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందన్నారు. ఇది చంద్రబాబు దార్శనికత అని లోకేష్ ట్వీట్ చేశారు.

లోకేష్ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ చెప్పింది నిజమే అని టీడీపీ నేతలు అంటే.. డబ్బా కొట్టుకోవడం అంటే ఇదే అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రతి విషయాన్ని తమ గొప్పదనంగా చెప్పుకోవడం, తమ వల్లే సాధ్యమైందని ప్రచారం చేసుకోవడం టీడీపీ నేతలకు అలవాటే అని సెటైర్లు వేస్తున్నారు.

లోకేష్ తన ట్వీట్ కి ఓ ఫొటో కూడా జత చేసి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం రోజున వైసీపీ నేతల క్రీడా పరిజ్ఞానాన్ని అభినందిద్దాం అంటూ.. విశాఖలో టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఫోటో కింద మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరు ఉన్న ఫ్లెక్సీని పోస్టు చేశారు. సానియా మీర్జా ఎవరో, పీటీ ఉష ఎవరో తెలియని దురావస్థలో వైసీపీ నేతలు ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.