రిసార్టులో‌ న్యూడిస్టులు : కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌ లుగా మార్చేస్తున్న ఇడియట్స్

  • Published By: nagamani ,Published On : August 25, 2020 / 10:53 AM IST
రిసార్టులో‌ న్యూడిస్టులు : కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌ లుగా మార్చేస్తున్న ఇడియట్స్

ఫ్రాన్స్‌, మోంటాపెల్లియర్‌లోని నేచర్‌ రిసార్ట్‌ ‘కాప్‌ డిఎగ్డే’ కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ సేద తీరుతున్న న్యూడిస్టుల నిర్లక్ష్యం కారణంగా హాట్ స్పాట్ నేచర్ రిసార్ట్ కాస్తా కరోనా హాట్ స్పాట్ గా మారిపోయింది. హాలిడే ఎంజాయ్ కోసం రిసార్ట్ కు వచ్చినవారు ఏమాత్రం కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం రిసార్ట్ కు వచ్చేవారు కరోనా టెస్ట్ చేయించుకున్నారా? లేదా అనేది కూడా అక్కడ చెక్కింగ్ లేదు.



దీంతో హాలిడే ఎంజాయ్ మెంట్ కోసం మోంటాపెల్లియర్‌లోని నేచర్‌ రిసార్ట్‌ ‘కాప్‌ డిఎగ్డే’కు వచ్చి..వెళ్లినవారికి మొత్తం 95 మందికి వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. రిసార్టులో‌ హాలిడేను ముగించుకుని ఇంటికి వెళ్లిన దాదాపు 55 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

గత సోమవారం (ఆగస్టు 16,2020) 194 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 38 మందికి, బుధవారం నాడు అంటే 19న మరో 244 మందికి పరీక్షలు నిర్వహించగా 57 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఫ్రాన్స్ వైద్యాధికారులు తెలిపారు.



రిసార్టులో ఉన్న న్యూడిస్టులు మాస్కులు ధరించకపోవటం, భౌతిక దూరాన్ని పాటించకపోవటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. 40 ఏళ్లలోపు ఉన్న వారిలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 2,42,899కు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి 30 వేల మంది మరణించారు.