విరాళాలు ఏమయ్యాయి : రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర ఆస్పత్రిలో వైద్యసేవలపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

ఆర్భాటంగా ప్రారంభించిన రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర ఆస్పత్రిలో సరైన వైద్య సేవలే అందడం లేదని వైసీపీ నేత, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు.  అసలు ఎన్ని విరాళాలు

  • Published By: veegamteam ,Published On : October 9, 2019 / 10:08 AM IST
విరాళాలు ఏమయ్యాయి : రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర ఆస్పత్రిలో వైద్యసేవలపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

ఆర్భాటంగా ప్రారంభించిన రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర ఆస్పత్రిలో సరైన వైద్య సేవలే అందడం లేదని వైసీపీ నేత, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు.  అసలు ఎన్ని విరాళాలు

ఆర్భాటంగా ప్రారంభించిన రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర ఆస్పత్రిలో సరైన వైద్య సేవలే అందడం లేదని వైసీపీ నేత, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు.  అసలు ఎన్ని విరాళాలు వచ్చాయో.. ఎలా ఖర్చయ్యాయో అన్నదానికీ లెక్కలు లేవన్నారు. ఈ వివరాలను కూచిబొట్ల ఆనంద్ బయటపెట్టాలని.. ప్రజలందరికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో విరాళాల లెక్క తేల్చాలని ప్రభుత్వాన్ని కోరతానని ఎమ్మెల్యే చెప్పారు. వేలాది మంది విరాళాలు ఇచ్చినప్పుడు.. రవిప్రకాశ్‌ పేరునే హాస్పిటల్‌కు ఎందుకు పెట్టారో చెప్పాలని ఎమ్మెల్యే అడిగారు.

బుధవారం(అక్టోబర్ 9,2019) ఎమ్మెల్యే అనిల్ కుమార్ సంజీవని ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల విరాళాలు ఏమయ్యాయని నిర్వాహకులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రశ్నలకు ఆస్పత్రి నిర్వాహకులు నీళ్లు నమిలారు. కూచిబొట్ల ఆనంద్ లేరని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వైద్య సేవలపై ఆసుపత్రి నిర్వాహకులను స్థానికులు నిలదీశారు. భారీగా విరాళాలు ఇచ్చినా వైద్యం చేయడం లేదని వాపోయారు. సరైన చికిత్స చేయకపోవడంతో తమ బంధువు చనిపోయాడని ఎమ్మెల్యే అనిల్ కి స్థానికుడి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయాక రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఆస్పత్రిలో ఉన్నవారిని బయటికి గెంటేశారు. 

పేద ప్రజలకు ఉచితంగా అమెరికా స్థాయి వైద్యం అంటూ ప్రచారం.. సామాన్యుడి నుంచి ప్రవాసాంధ్రుల వరకూ…. కోట్లకు కోట్లు విరాళాల సేకరణ. అందరికీ చూపించడానికి భారీ బిల్డింగ్ నిర్మాణం. కానీ.. ఆస్పత్రిలో సేవలు మాత్రం నిల్‌. అత్యాధునిక వైద్యం కాదు కదా.. సాధారణ చికిత్స కూడా అక్కడ ఉచితంగా అందడం లేదు. ఇదీ కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్- సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి వ్యవహారం. పేరు పెట్టుకోవడంలోనూ.. విరాళాలు సేకరించడంలోనూ శ్రద్ధ చూపించిన రవిప్రకాశ్.. ఆస్పత్రిలో చికిత్సల విషయంలో మాత్రం పట్టించుకోలేదు. అసలు..చికిత్సనందించే ఏర్పాట్లే చేయలేదు. 

ఈ వ్యవహారమంతటినీ 10టీవీ బయటపెట్టడంతో.. వైసీపీ నేత, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్‌ కుమార్ స్పందించారు. వెంటనే రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రికి వెళ్లారు. హాస్పిటల్ మొత్తాన్ని పరిశీలించారు. అక్కడ చికిత్సలేవీ అందకపోవడంపై ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఆస్పత్రి సిబ్బంది సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌ సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రశ్నించడానికి వెళ్లిన గ్రామస్తులపై… ఆస్పత్రి సిబ్బంది దాడికి దిగారు. బలవంతంగా బయటకు గెంటేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు… ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో సంజీవని హాస్పిటల్‌లో తమ బంధువులు చనిపోయారంటూ… కొందరు గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే అనిల్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనిల్‌తో కలిసి ఆస్పత్రిలోకి వెళ్లిన స్థానికులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.