ఏపీలో నేడే పంచాయితీ సెక్రెటరీ పరిక్ష: ఒక్క జాబ్‌కు 471 మంది పోటీ

  • Published By: vamsi ,Published On : April 21, 2019 / 02:13 AM IST
ఏపీలో నేడే పంచాయితీ సెక్రెటరీ పరిక్ష: ఒక్క జాబ్‌కు 471 మంది పోటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ సెక్రెటరీ(గ్రేడ్-4) నియామకాలకు సంబంధించిన పరిక్ష ఇవాళ(21 ఏప్రిల్ 2019) జరగనుంది. 13 జిల్లాల్లో మొత్తం 1320 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 1051 ఉద్యోగాల భర్తీకి ఎపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 4,95,526 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క ఉద్యోగానికి 471 మందికిపైగా అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వీరిలో పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు, ఇంజినీరింగ్ చదివిన విద్యార్ధులే అధికంగా ఉండడం విశేషం.

పరీక్ష ఉదయం 10.00 నుంచి 12.30 గంటల వరకు అభ్యర్ధులకు కేటాయించిన కేంద్రాలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు గుర్తింపు కార్డు ఒరిజినల్‌ ఒకటి తీసుకుని రావలసి ఉంటుంది. పాస్‌పోర్టు, ఆధార్‌, ఓటరు కార్డు, పాన్ కార్డు‌, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్ లలో ఏదో ఒకటి అభ్యర్ధులు తమ వెంట తీసుకుని రావాలని అధికారులు సూచించారు.