మహిళల కోసం అభయ్ : రా.9 నుంచి ఉ.5 వరకు ఉచితంగా ఇళ్ల దగ్గర డ్రాప్ చేస్తారు

శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 11:05 AM IST
మహిళల కోసం అభయ్ : రా.9 నుంచి ఉ.5 వరకు ఉచితంగా ఇళ్ల దగ్గర డ్రాప్ చేస్తారు

శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి.

శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి. మహిళల భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మహిళల సేఫ్టీ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. అదే ”అభయ్ డ్రాప్ హోం సర్వీస్”. 

అభయ్ డ్రాప్ హోం సర్వీస్ ను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో (రా.9 నుంచి తెల్లవారుజామున 5.గంటల వరకు) డయల్ 100కు ఫోన్ చేస్తే.. మహిళలను అభయ్ వాహనాల ద్వారా ఉచితంగా వారి గమ్య స్థానాలకు పోలీసులే చేరుస్తారని ఎస్పీ చెప్పారు. అభయ్ వాహనాల్లో డ్రైవర్‌తో పాటూ మహిళా కానిస్టేబుల్ ఉంటారని తెలిపారు. మహిళలను సురక్షితంగా ఇళ్లకు చేరుస్తామన్నారు. అభయ్ వాహనాలను కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తామని ఎస్పీ వెల్లడించారు.

మహిళల కోసం అభయ్ డ్రాప్ హోం సర్వీస్‌ పేరుతో ఈ వాహనాలు ప్రారంభమయ్యాయి. అత్యవసర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు మహిళలకు సూచించారు. వెంటనే అభయ్ డ్రాపింగ్ వెహికల్‌లో మహిళలను గమ్య స్థానాలకు పోలీసులే చేరుస్తారని తెలిపారు.

abhay

మహిళ రక్షణ, భద్రత కోసమే ఈ అభయ్ డ్రాప్ హోం సర్వీస్ ప్రారంభించామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. మహిళలు అత్యవసర సమయాల్లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ అభయ్ డ్రాప్ హోం సర్వీస్ ప్రస్తుతం ఒంగోలు సబ్ డివిజన్‌లో నాలుగు, చీరాల సబ్ డివిజన్‌లో రెండు.. మార్కాపురం, కందుకూరు సబ్ డివిజన్ లో ఒక్కో వాహనం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనతో మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ మెట్రోలోకి పెప్పర్ స్ప్రే అనుమతించారు. జీరో ఎఫ్‌ఐఆర్.. ఎమర్జెన్సీ, టోల్ ఫ్రీ నెంబర్లు.. తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వినూత్న ఆలోచనతో.. అభయ్ పేరిట మహిళల కోసం ప్రత్యేకంగా డ్రాపింగ్ సౌకర్యాన్ని కల్పించారు. పోలీసుల నిర్ణయం పట్ల మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో అభయ్ వాహనాలు తమకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.