నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు..  రీజన్ ఇదే

నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు..  రీజన్ ఇదే

నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు..  రీజన్ ఇదే

తన కోసం తన కుటుంబం నుండి జనసేన పార్టీలోకి ఎవరూ రారు అని, వారు తన కుటుంబ సభ్యులు మాత్రమేనని, అంతే తప్ప వారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని ఒకప్పుడు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగబాబుకు నర్సాపురం టిక్కెట్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది. జనసేన పార్టీ తరుపున నాగబాబు ఎంట్రీతో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయం ఆ పార్టీ వర్గాలకే అర్థం కావట్లేదు.
Read Also :మెగా టీం : జనసేనలోకి నాగబాబు – నరసాపురం ఎంపీగా పోటీ

ఇక నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం పార్లమెంటకు జనసేనలో మంచి పోటీ ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం కూడా నరసాపురం పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. ఈ క్రమంలో తను పోటీ చేసే నియోజకవర్గం ఎఫెక్ట్‌తో నరసాపురం పార్లమెంటును గెలవవచ్చనే ఆలోచనలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి గతంలో విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి అల్లూ అరవింద్ పోటీ చేసి ఓడిపోగా.. ఇప్పుడు నాగబాబు పార్లమెంట్‌కు మెగా ఫ్యామిలీ నుండి పోటీ చేస్తున్నారు.

గత కొన్నిరోజులుగా నాగబాబు జనసేనకు సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో జనసేన పార్టీకి కూడా ఆయన రూ.కోటి 25లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసింతే.  
Read Also :దొడ్డిదారిన కాదు.. రాయల్‌గా తీసుకొచ్చా : నాగబాబు ఎంట్రీపై పవన్

×