హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. భారీగా నామినేషన్ల తిరస్కరణ

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సాంకేతిక కారణాలను చూపిస్తూ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 12:57 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. భారీగా నామినేషన్ల తిరస్కరణ

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సాంకేతిక కారణాలను చూపిస్తూ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సాంకేతిక కారణాలను చూపిస్తూ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. ఫామ్ 26 లో పూర్తి వివరాలు లేనందునే తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు మాత్రం ఎన్నికల అధికారులు కావాలనే నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కార్యకర్తలు ఆందోళన చేపట్టాయి.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరులో మొత్తం 76 మంది అభ్యర్థులు.. 119 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నిన్నటితో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తి కాగా పరిశీలన కొనసాగుతోంది. ఇప్పటివరకు 76 నామినేషన్లను పరిశీలించిన అధికారులు అందులో 45 నామినేషన్లను తిరస్కరించారు. వీరిలో సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులు కూడా ఉన్నారు. అలాగే 85 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీ నర్సమ్మ, వికలాంగుల సంఘం అధ్యక్షుడు రాజేశ్ తో పాటు సర్పంచ్ సంఘం నేతల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 

నామినేషన్లలో లోపాల వల్ల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థులు మాత్రం రిటర్నింగ్ అధికారిపై ఆరోపణలు కురిపిస్తున్నారు. ఏదో వంక చెప్పి నామినేషన్లను తిరస్కరించారని వాపోతున్నారు. ఇక సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ ను తిరస్కరించడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. తన నామినేషన్ ను కావాలనే తిరస్కరించారంటూ శేఖర్ రావు ఆరోపించారు. 
 

(అక్టోబర్ 21, 2019)వ తేదీన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. (అక్టోబర్ 24, 2019)వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు ఎవరికివారే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. హుజూర్ నగర్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.