అమరావతికి సపోర్ట్ చేసిన విద్యార్ధులను సస్పెండ్ చేసిన యూనివర్శిటీ

  • Published By: vamsi ,Published On : February 1, 2020 / 08:41 PM IST
అమరావతికి సపోర్ట్ చేసిన విద్యార్ధులను సస్పెండ్ చేసిన యూనివర్శిటీ

రోజులు దాటి నెల దాటి పోయింది అమరావతి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి అమరావతికి మద్దతు పలుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున యూనివర్శిటీ నుంచి కూడా విద్యార్ధులు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. 

అయితే అమరావతి కోసం గళం విప్పిన నలుగురు విద్యార్థులపై చర్యలు తీసుకుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అమరావతి కి మద్దుతు గా ప్రదర్శన లో పాల్గొన్నారంటూ నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. యూనివర్శిటీకి చెందిన ఆశీర్వాదం, నవీన్, రాజు, ఏడుకొండలును ఏఎన్‌యూ వీసీ సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలో అమరావతికి మద్దతుగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారంటూ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి జేఏసీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నందుకే చర్యలు తీసుకున్నట్లుగా నోటీసును కూడా సదరు యూనివర్శిటీ విడుదల చేసింది. నలుగురు విద్యార్ధులలో ఆశిర్వాదం, నవీన్ జర్నలిజం కోర్సు చేస్తున్నారు.

Amaravathi