పాలగిన్నె విషం చిమ్మిన పాము..ఆ పాలు తాగిన కవల పిల్లలు మృతి

  • Published By: nagamani ,Published On : September 14, 2020 / 01:01 PM IST
పాలగిన్నె విషం చిమ్మిన పాము..ఆ పాలు తాగిన కవల పిల్లలు మృతి

యూపీలోని గాజీపూర్‌లోగల మర్ద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్నామర్ద్ గ్రామంలో రాత్రి 2 గంటల సమయంలో ఇద్దరు పసిబిడ్డలు ఆకలికి ఏడుస్తున్నారు. ఆకలేసి పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న8 నెలల కవల పిల్లల ఏడుపుకు వారి తండ్రికి మెలకువ వచ్చింది. పక్కనే చూడగా అలసిపోయిన భార్య నిద్రపోతూ కనిపించింది. లేపటం ఎందుకని తానే వంట ఇంటిలో ఉన్న పాలగిన్నెలో ఉన్న పాలు కలిపి పట్టాడు. పాలు తాగటంతో చిట్టి బొజ్జలు నిండటంతో పసిబిడ్డలిద్దరూ హాయిగా నిద్రపోయారు.


కానీ కాసేపటికే నోటిలోంచి నురుగలు కక్కుతూండటంతో చూసిన తండ్రి కంగారుపడిపోయాడు. వెంటనే పెద్దగా కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకుని వచ్చారు. వాళ్లను పాము కరిచిందా అని చూస్తే వాళ్ల శరీరం మీద అలాంటి ఆనవాళ్లు ఏం కనిపించలేదు. దీంతో వారంతా ఇంట్లో నలుమూలలా చూశారు. వారికి అక్కడే ఓ పాము కప్పను మింగుతూ కనిపించింది. ఆ పామే పాలను తాగి ఉంటుందని.. అది తాగిన పాలను తాగడం వల్లే చిన్నారులు మృతిచెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.


దీంతో బిడ్డలిద్దరినీ తీసుకుని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే పసిబిడ్డల శరీరాలు నల్లగా మారిపోయాయి..దీంతో వెంటనే డాక్టర్లు చికిత్స చేసిన ఫలితం దక్కలేదు. పాపలు తాగిన పాలు విషపూరితం కావటం వల్లనే చనిపోయారని డాక్టర్లు చెప్పటంతో ఆ తండ్రి ఇంటికొచ్చి చూడగా అ ప్రాంతంలో పాము కనిపించటంతో పాము తమ బిడ్డల్ని పొట్టన పెట్టుకుందని..నా చేతులారా నాబిడ్డల్ని చంపుకున్నానే అంటూ భోరున ఏడ్చాడు. ఈ విషాద ఘటనతో ఛోట్నామర్ద్ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. పిల్లల తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు.