Viral Video: చిరుత పులినే భయపెట్టిన వీధి కుక్క.. చిరుతకు ఎదురు నిలిచి ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్

చిరుతను చూస్తే ఏ సాధారణ జంతువైనా భయపడిపోతుంది. అందులోనూ వీధి కుక్కైతే వెంటనే భయపడుతుంది. కానీ, ఒక కుక్క మాత్రం చిరుతనే ఎదిరించింది. తనపైకి దాడికి వచ్చిన చిరుతను కుక్క బెదరగొట్టింది.

Viral Video: చిరుత పులినే భయపెట్టిన వీధి కుక్క.. చిరుతకు ఎదురు నిలిచి ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్

Updated On : November 8, 2022 / 1:27 PM IST

Viral Video: చిరుత పులితో పోలిస్తే కుక్క చాలా తక్కువ శక్తి కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ రెండూ తలపడితే చిరుతదే పై చేయి. అలాంటి చిరుత పులిని భయపెట్టిందో వీధి కుక్క. తనపైకి దాడికి వచ్చిన చిరుతను ఒక కుక్క బెదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?

జైకీ యాదవ్ అనే ట్విట్టర్ యూజర్ ఇటీవల తన అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేశాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు. ఈ వీడియో ప్రకారం.. ఒక కుక్క రోడ్డు పక్కన పడుకుని ఉంది. పక్కనే చెట్లలోంచి ఒక చిరుత ఆ రోడ్డు వైపు వచ్చింది. అక్కడే ఉన్న కుక్కను చూసి, దాన్ని చంపి తినాలనుకుంది. వెంటనే కుక్కపైకి దూకబోయింది. కానీ, ఇది గమనించిన కుక్క వెంటనే లేచి అప్రమత్తమైంది. చిరుతకు భయపడి పారిపోకుండా, గట్టిగా అరుస్తూ దాన్ని బెదరగొట్టింది.

చిరుతకు ఎదురు నిలిచింది. కుక్క గట్టిగా అరవడంతో ఆ చిరుత భయపడి అలాగే చూస్తూ ఉండిపోయింది. కుక్క ఏమాత్రం భయపడినా, లేక అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా చిరుత నోటికి బలైపోయేదే. కానీ, ధైర్యంగా ఎదురు నిలిచిన కుక్క తనను తాను రక్షించుకుంది.