కీపర్ వెనుక పరుగులు పెడుతున్న బేబీ ఎలిఫెంట్ ‘వేదావతి’

కీపర్ వెనుక పరుగులు పెడుతున్న బేబీ ఎలిఫెంట్ ‘వేదావతి’

Elephant

సాధారణంగా మనం పెంచుకునే పెంపుడు జంతువులైనా కుక్కలు బయటకు వెళ్లి వాకింగ్ చేయటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాయి. తాజాగా ఓ ఏనుగు పిల్ల జంతువుల కీపర్ తో కలిసి వాకింగ్ చేస్తూ, పరుగులు పెడుతున్నా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఏనుగు పిల్ల ‘వేదావతి’జంతు కీపర్ సోమును అనుసరిస్తూ నడుస్తున్న తీరు మన హృదయాల్ని హత్తుకునే విధంగా ఉంది. ఈ వీడియోలను ‘జూస్ ఆఫ్ కర్ణాటక’తన ట్విట్టర్ ద్వారా షేర్ పంచుకుంది.

కర్ణాటకలోని మైసూర్ జంతు ప్రదర్శనాలలో అనుభవజ్ఞుడైన జంతు కీపర్ సోము ‘వేదావతి’అనే ఏనుగుపిల్లను పెంచుతున్నాడు. వేదావతి మైసూర్ జూకు వచ్చినప్పుడు 89 కిలోల బరువు ఉండేది. రెండు నెలల తర్వాత కీపర్ సోము చూపించిన శ్రద్దతో 20 కిలోల బరువు పెరిగింది. ప్రస్తుతం 110 కిలోల బరువుంది. ఇప్పటికే సోము వేదావతిని కాక , ఐదు ఏనుగులను పెంచటంలో అనుభవజ్ఞడైన నేర్పరి.

ప్రస్తుతం వేదావతి అనే ఏనుగు పిల్ల రోజు కీపర్ తో కలిసి వాకింగ్ చేయటానికి ఇష్టపడుతుంది. కాబట్టి ప్రతిరోజు వేదావతిని జూ చుట్టూ వాకింగ్ తీసుకువెళతానని కీపర్ సోము చెప్పారు. ఓ వీడియోలో కీపర్ ను అనుసరిస్తూ నడవటం కనిపిస్తుంది. అంతేకాకుండా సోము మాట్లాడుతున్నప్పుడు వేదావతి తన ట్రంక్ తో కీపర్ తో ఎంతో ఉత్సాహంగా ఆడుకోవటం కనిపిస్తుంది. కీపర్ వేదావతిని రోజుకు మూడు సార్లు వాకింగ్ కి తీసుకువెళ్తాడని జూస్ అథారిటీ తెలిపింది.

కర్ణాటక జంతు ప్రదర్శనశాల రెండు వీడియోలను ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇప్పటివరకు 6వేల మంది వీక్షించారు. 4 వందల మందికి పైగా లైకులు వచ్చాయి. మనస్సు ను హత్తుకునే విధంగా ఉన్నాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.