ఏం జరిగింది : స్విమ్మింగ్ పూల్ లో కారు

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 01:23 AM IST
ఏం జరిగింది : స్విమ్మింగ్ పూల్ లో కారు

స్విమ్మింగ్ పూల్ లో మునిగిన కారు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన అమెరికాలోని ఒక హోటల్‌ లో జరిగింది. ఇంతకీ అసలు ఆ కారు హోటల్ లోకి ఎలా వచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో ఎలా పడిందని ఆలోచిస్తున్నారా..?

అసలు విషయమేంటంటే.. అమెరికాలోని ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్లు (జనవరి 4, 2020)న ఫేస్ బుక్ లో ఒక స్విమ్మింగ్ ఫూల్ ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో హోటల్ స్విమ్మింగ్ పూల్ లో మునిగిన బ్లాక్ కారు కనపడింది. దాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక యువతి కారులో ఫ్లోరిడాలోని ఓ హోటల్ కు వచ్చింది.  అయితే కారు ఆపతుండగా.. దానిపై నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో కారు డైరెక్ట్ గా అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి పడి మునిగిపోయింది. వెంటనే ఆమె కారు వెనక భాగం నుంచి డోర్ తీసుకుని బయటకు వచ్చేసింది. దీంతో ఆమె ప్రాణాలకు ఏ ప్రమాదం తప్పింది. 

అయితే ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు కాబట్టి అక్కడ పార్క్ చేసి ఉంటారని కొందరు, ఆ కారు జీవం లేకపోయినా స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తుందని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే కారు కి గర్ల్ ఫ్రెండ్ ని చూస్తే ఇద్దరు కలిసి ఫూల్ లో ఎంజాయ్ చేస్తారని కామెంట్ చేస్తున్నారు.