షాకింగ్ : పాప్‌కార్న్ తిన్నందుకు గుండెకు సర్జరీ

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 01:59 AM IST
షాకింగ్ : పాప్‌కార్న్ తిన్నందుకు గుండెకు సర్జరీ

సాధారణంగా సినిమాకు వెళితే మనం కచ్చితంగా కొనుక్కునేది.. ప్రయాణం చేసేప్పుడు తినాలనిపించేది.. పాప్‌కార్న్. మరి ఆ పాప్‌కార్న్ తినే ముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పాప్‌కార్న్ వల్ల ఏం ప్రమాదం జరుగుతుందని మీరు సందేహం రావొచ్చు. కానీ, UKలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే.. ఇంకోసారి పాప్‌కార్న్ తినాలంటే భయపడతారు.

అసలేం జరిగిందంటే.. UKలో అడమ్ మార్టిన్ అనే 41 ఏళ్ల వ్యక్తికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఓ పాప్‌కార్న్ ముక్క పంటిలో ఇరుక్కుంది. దాన్ని బయటకు తీసేందుకు అతడు టూత్ పిక్, పెన్ లిడ్, సన్నని వైరు.. ఇలా ఏవేవో ఉపయోగించాడు. దీంతో అతని చిగుళ్లకు గాయాలయ్యాయి. కానీ, అది మాత్రం బయటకు రాలేదు. దీంతో చిన్నగా అదే పోతుందిలే అని దాన్ని వదిలేశాడు.

ఇక అంతే.. అప్పటి నుంచి అతడికి రాత్రి వేళల్లో విపరీతమైన చెమట్లు పట్టడం, తలనొప్పి రావడం, అలసటగా అనిపించడం మొదలైంది. ఫీవర్ అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కొన్నిరోజులకు ఆ పాప్‌కార్న్ ముక్క వల్ల అతడి పంటి చిగుళ్లు ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయి.

Read Also..OMG: మూడో అంతస్తు గోడపై చిన్నారి వాకింగ్.. వీడియో వైరల్

దానివల్ల అతడు హస్పిటల్ కు వెళ్లి చూపించుకున్నాడు. వైద్యులు అతడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో అతడు షాక్ తిన్నాడు. పంటి ఇన్ఫెక్షన్ కి గుండెకు సంబంధం ఏంటి అని డాక్టర్లను అడిగాడు. 

పంటి చిగుళ్లకు ఏర్పడిన గాయల్లో బ్యాక్టీరియా తిష్టవేయడంతో ఇన్ఫెక్షన్ ఏర్పడిందని.. ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా గుండె లోపలి పొరల్లోకి చేరిందని డాక్టర్లు వివరించారు. అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని తెలిపారు. వెంటనే వైద్యులు అతడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. సో.. బీ కేర్ ఫుల్.. పాప్ కార్న్ ని తక్కువ అంచనా వేయొద్దు.