ప్రపంచంలోనే అతి పెద్ద ముత్యం.. 27 కిలోల బరువు

బంగారు ఆక్టోపస్‌ బొమ్మలో ఉన్న ముత్యాన్ని చూశారా? చూసేందుకు సాధారణ వైట్ స్టోన్ లాగా కనిపిస్తున్నా కొన్ని కోట్లు విలువ చేస్తుంది.

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 12:22 PM IST
ప్రపంచంలోనే అతి పెద్ద ముత్యం.. 27 కిలోల బరువు

బంగారు ఆక్టోపస్‌ బొమ్మలో ఉన్న ముత్యాన్ని చూశారా? చూసేందుకు సాధారణ వైట్ స్టోన్ లాగా కనిపిస్తున్నా కొన్ని కోట్లు విలువ చేస్తుంది.

బంగారు ఆక్టోపస్‌ బొమ్మలో ఉన్న ఈ ముత్యాన్ని ఓసారి లుక్కేయండి. చూడటానికి నార్మల్ వైట్ స్టోన్ లా కనిపిస్తున్నా కొన్ని కోట్లు విలువ చేస్తుందంట. ముత్యం విలువ 90 మిలియన్లు (రూ.630 కోట్లు) వరకు ఉంటుందని అంచనా. అంతేకాదు.. 27.65 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ ముత్యం చూడటానికి చిన్నగానే ఉన్నప్పటికీ.. ఓ చిన్న సైజు పిల్లాడంత పరిమాణంలో ఉంటుంది. 

సుమారు వెయ్యి ఏళ్ల పురాతనమైన ముత్యంగా రేయెస్ తెలిపాడు. ఫిలిపీన్స్‌లోని ఓ జాలరి నుంచి రేయెస్ అనే వ్యక్తి ఈ ముత్యాన్ని తీసుకున్నాడు. ఆ ముత్యం అంత ఖరీదు ఉంటుందని తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియదని  తెలిపాడు. ముత్యంలా కనిపించకపోవడం వల్ల దాన్ని విలువైన వస్తువుగా గుర్తించలేదని రేయెస్ చెప్పుకొచ్చాడు. 

ఈ ముత్యాన్ని ఇటీవల పరిశీలించిన జియోలాజికల్ స్పెషలిస్టులు దీని విలువ 60 నుంచి 90 మిలియన్ డాలర్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ ముత్యాన్ని పట్టుకుని ఉన్న మిలమిల మెరిసే ఆక్టోపస్‌ బొమ్మను 22 క్యారెట్ల బంగారంతో తయారు చేయడం విశేషం. ఈ ముత్యాన్ని త్వరలోనే ప్రపంచంలోని అన్ని మ్యూజియంల్లో ప్రదర్శిస్తానని రేయెస్ చెప్పాడు.