గూగుల్ ఎర్త్ లో ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి ఫొటోలు చూశాడు

గూగుల్ ఎర్త్ లో ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి ఫొటోలు చూశాడు

Man finds image of dad on Google Earth : గూగుల్ ఎర్త్ లో ఏడేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి ఫొటోలు చూసిన కొడుకు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. తాను ఎదుర్కొన్న విషయాలను పంచుకున్నాడు ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది. TeacherUfo పేరిట అకౌంట్ ఉన్న ఆ వ్యక్తి లాక్ డౌన్ సమయంలో బోర్ కొట్టడంతో సరదాగా..గూగుల్ ఎర్త్ చూడడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ఓ రోజు.. తన తల్లిదండ్రులున్నఇల్లును చూడాలని అనుకున్నాడు. ఆశ్చర్యకరంగా..ఆ ఇల్లు ఫొటో కనిపించడం..ఇంటి ఎదుట తన తండ్రి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.

అతనికి ఎదురుగా తల్లి నడుచుకుంటూ వస్తుండడం ఆ ఫొటోలో కనిపించింది. అప్పటికే తండ్రి చనిపోయి ఏడు సంవత్సరాలు అయ్యిందని భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రిని ఎప్పుడు కావాలంటే..అప్పడు చూసుకొనే అవకాశాన్ని కల్పించినందుకు ఆ వ్యక్తి గూగుల్ కు థాంక్స్ చెప్పాడు. ఈ ఫొటోను అప్ డేట్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. జపాన్ భాషలో చేసిన ఈ ట్వీట్ కు ఆరు మిలియన్లకు పైగా లైక్ లు రాగా..ఎంతో మంది రీ ట్వీట్ చేశారు.

పొలాల్లో పని చేస్తూ..గత సంవత్సరం grandmother చనిపోయారని, గూగుల్ ఎర్త్ లో తాను చూడడం జరిగిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వృద్దాప్య కారణంగా పెంపుడు కుక్క చిత్రాన్ని కూడా చూశానని మరొకరు తెలిపారు. ఇలా మంది తాము ఎదుర్కొన్న విషయాలను కామెంట్స్ రూపంలో తెలియచేశారు.