అమ్మాయి లుంగీ కట్టుకుని రోడ్లపై తిరుగుతోంటే అందరూ ఇలా చూస్తున్నారేంటి?

Viral Video: లుంగీ కట్టుకున్న అమ్మాయిని చాలా మంది విచిత్రంగా చూశారు.

అమ్మాయి లుంగీ కట్టుకుని రోడ్లపై తిరుగుతోంటే అందరూ ఇలా చూస్తున్నారేంటి?

Streets Of London

భారతీయ పురుషులు చాలా మంది ఇళ్లలో ఉన్న సమయంలో లుంగీలు కట్టుకుంటారు. లుంగీలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే, ఓ అమ్మాయి.. అదీ లండన్‌లో లుంగీ కట్టుకుని రోడ్లపై తిరిగింది. షాపింగ్ మాల్స్ లోకి కూడా వెళ్లింది.

తను కట్టుకున్న లుంగీ ఎలా ఉందని కొందరిని అడిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లుంగీ కట్టుకున్న అమ్మాయిని చాలా మంది విచిత్రంగా చూశారు. అమ్మాయిలు లుంగీలు కట్టుకోవద్దా ఏంటి? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అన్నింట్లో సమాన హక్కు కావాలని పోరాడుతున్న మహిళలకు మరి లుంగీలు కట్టుకోవడంలోనూ సమాన హక్కు కావాలి కదా? అని కొందరు కామెంట్ చేశారు. లుంగీ, టీషర్ట్ తో కనపడుతున్న అమ్మాయి అందరినీ ఆకట్టుకుంటోంది.

లుంగీ కట్టుకుని సన్ గ్లాసెస్ పెట్టుకుని షాపింగ్ మాల్ కి వెళ్లిన ఆ అమ్మాయిని అందులోని వారు కూడా వింతగా చూశారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఆ అమ్మాయి ఈవీడియోలు పోస్ట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో పుష్ప-1 సినిమాలోని పాటను జోడించింది.

 

View this post on Instagram

 

A post shared by valery (@valerydaania)

Rahul Tripathi : అది చాలా క్లిష్టసమయం.. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ త్రిపాఠి వ్యాఖ్య‌లు..