OMG : ఆడుకునే బొమ్మ మింగి.. నటుడి కుమార్తె మృతి

  • Published By: madhu ,Published On : May 10, 2019 / 05:48 AM IST
OMG : ఆడుకునే బొమ్మ మింగి.. నటుడి కుమార్తె మృతి

Updated On : May 28, 2020 / 3:42 PM IST

టీవీ నటుడు ప్రతీష్ వోరా ఇంట్లో ఊహించని విషాదం. అల్లారుముద్దుగా, అల్లరి చేస్తూ అందరికీ ఆనందం పంచుతున్న ఓరా కుమార్తె చనిపోయింది. ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. ప్లాస్టిక్ బొమ్మను మింగింది. పాప ఏడుస్తుంటే ఆకలి అనుకున్నారు.. సముదాయించారు.. ఎంత సేపటికీ ఏడుపు ఆపలేదు.

ఆ తర్వాత ఊపరి తీసుకోవటం ఇబ్బంది పడుతుంటే వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశారు కుటుంబ సభ్యులు. అప్పుడు కానీ విషయం తెలియలేదు.. చిన్నారి గొంతులో ఓ చిన్న బొమ్మ ఇరుక్కుందని. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు వెంటనే గొంతులోని బొమ్మను తలగించినా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 
Also Read : TV9 రవి ప్రకాష్ చుట్టూ ఉచ్చు : విచారణకు హాజరవుతారా

 రెండేళ్ల కన్నకూతురు ఊహించని విధంగా చనిపోవటాన్ని జీర్ణించుకోలేకుండా ఉంది ప్రతీష్ ఓరా కుటుంబం. లెక్కలేనన్ని బొమ్మలతో చిన్నారి ముచ్చట తీరుస్తున్నారు. అవే బొమ్మలు ఇప్పుడు ప్రాణం తీశాయి అంటూ బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన హిందీ టీవీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఆయన కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదు.. కేవలం ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని చనిపోయింది అంటూ ఘటనపై చర్చించుకుంటున్నారు.

ప్రతీష్‌ ఓరా ప్రముఖ టీవీ నటుడు. పలు సీరియల్స్‌లో నటించాడు. ప్రస్తుతం ప్యార్ కే పాపడ్ అనే షోలో నటిస్తున్నారు. తారక్ మెహతా కా వూల్తా, క్రైమ్ పెట్రోల్ అనే షోలలో కూడా నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Cuteness overloaded ? #cutebabies #family #indiancutebaby #littlebaby #cutiepie #babygirl #cutenessoverload

A post shared by Pratish Vora (@vorapratishofficial) on