BiggBoss Telugu 5 : బిగ్‌బాస్ 5 షో.. ఎప్పటినుంచో తెలుసా?
తెలుగు టెలివిజిన్ రియాల్టీ బిగ్ బాస్ షో త్వరలో ప్రారంభం కాబోతుందని టాక్.. బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.. కరోనా నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కంటెస్టెంట్స్ ను ముందుగా క్వారంటైన్ లో ఉంచనున్నట్టు తెలిసింది.
BiggBoss Telugu 5 : తెలుగు టెలివిజిన్ రియాల్టీ బిగ్ బాస్ షో త్వరలో ప్రారంభం కాబోతుందని టాక్.. బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.. కరోనా నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కంటెస్టెంట్స్ ను ముందుగా క్వారంటైన్ లో ఉంచనున్నట్టు తెలిసింది. అగష్టులో బిగ్‌బాస్ 5ని ప్రారంభించేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారంట.. కంటెస్టెంట్స్ సెలెక్షన్లు కూడా దాదాపు పూరైందని టాక్ వినిపిస్తోంది.
ఆగష్టు నాటికి కరోనా కేసులు తగ్గిపోయి సాధారణ పరిస్థితులు ఉంటే మాత్రం బిగ్ బాస్ షోను ప్రారంభించనున్నారట.. సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా కూడా రెడీ అయిందంట.. కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. తుది జాబితాలో ఆ కంటెస్టెంట్లే ఉంటారో లేదో చూడాలి. గత రెండు సీజన్లను విజయవంతంగా నడిపిన కింగ్ నాగార్జునే ఐదో సీజన్ కూడా హోస్ట్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ముగిసి నెలకే ఐదో సీజన్ పనులు ప్రారంభించారట.. అధికారిక యూట్యూబ్ చానెల్లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే బిగ్‌బాస్ నిర్వాహకులు నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలోనే బిగ్‌బాస్ 5 సీజన్‌ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ షోకు పలువురు నటీనటులను సంప్రదించినట్టు కూడా తెలిసింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమవుతుందో లేదో చూడాలి.