ఊటీలో హైటెన్షన్ : ప్రతి ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తున్నారు

ష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి చొరబడినట్టు కేంద్ర నిఘావర్గాలు చేసిన హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో హై అలర్ట్

  • Published By: veegamteam ,Published On : August 25, 2019 / 03:49 AM IST
ఊటీలో హైటెన్షన్ : ప్రతి ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తున్నారు

ష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి చొరబడినట్టు కేంద్ర నిఘావర్గాలు చేసిన హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో హై అలర్ట్

లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి చొరబడినట్టు కేంద్ర నిఘావర్గాలు చేసిన హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు. సోదాలను ముమ్మరం చేశారు. ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీలో పోలీసులు, బ్లాక్ కమాండోలు రంగంలోకి దిగారు. ఊటీలోని వీధులను జల్లెడ పడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఆ ఇంట్లో వారి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరెవరు ఉంటున్నారు అనేది నోట్ చేసుకుంటున్నారు. అనుమానంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో భయపడాల్సిన పనిలేదని ప్రజలకు కమాండోలు ధైర్యం చెబుతున్నారు.

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ పాకిస్థానీతోపాటు ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లిములు హిందువుల పేరిట దాడులు చేసేందుకు తమిళనాడులోకి ప్రవేశించారని ఇంటలిజెన్స్ వర్గాలు కోయంబత్తూర్ తోపాటు అన్ని జిల్లాల ఎస్పీలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోయంబత్తూర్ నగరంలో సాయుధ పోలీసులను మోహరించి సోదాలు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు, పర్యాటక ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో సముద్ర తీరప్రాంతాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. గురువారం(ఆగస్టు 22,2019) అర్దరాత్రి నుంచి సాయుధ పోలీసులు మందిరాలు, లాడ్జీలు, బహిరంగ స్థలాల్లో తనిఖీలు జరుపుతున్నారు.