రిపోర్టర్ పై కత్తులు, బీరు సీసాలతో దాడి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ దినపత్రిక రిపోర్టర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ దినపత్రిక రిపోర్టర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ దినపత్రిక రిపోర్టర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఏటూరునాగారం వాసులు వాసంపల్లి ప్రవీణ్, ఎంపెల్లి కిశోర్, చరణ్ అనే ముగ్గురు రిపోర్టర్ గంపల శివకుమార్ పై కత్తులు, బీరు సీసాలతో దాడి చేశారు.
అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఉపాధి హామీపై వార్తలు రాస్తున్నాడనే అక్కసుతోనే విలేకరిపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.