R Madhavan : మీరాబాయి లంచ్పై మాధవన్ కామెంట్స్
మీరాబాయి చాను ఫొటోని చూసిన నెటిజన్స్ మరింత ప్రశంసిస్తున్నారు. ఏ మాత్రం అహం లేకుండా..సింపుల్ గా ఉంటున్న మీరాబాయ్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా..దీనిపై హీరో మాధవన్ స్పందించారు.
Madhavan Comment : మీరాబాయి చాను..ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమ్రోగుతోంది. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న ఈమె వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సొంతం చేసుకోవడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పతకం సాధించిన అనంతరం మణిపూర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఘనస్వాగతం పలికారు. అయితే..ఇంటికి చేరుకున్న అనంతరం ఆమె నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
Read More : RAPO19: రామ్-లింగుస్వామి సినిమా కోసం కన్నడ బ్యూటీ!
ఈ ఫొటోని చూసిన నెటిజన్స్ ఆమెను మరింత ప్రశంసిస్తున్నారు. ఏ మాత్రం అహం లేకుండా..సింపుల్ గా ఉంటున్న మీరాబాయ్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా..దీనిపై హీరో మాధవన్ స్పందించారు. అసలు ఇది నిజమేనా ? నేను నమ్మడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.
Read More : UK PM Boris Johnson: 57ఏళ్ల వయస్సులో తండ్రి అవబోతున్న పీఎం బోరిస్ జాన్సన్
కామెంట్స్ అంతరార్థం ఏంటో తెలియడం లేదు అంటున్నారు. మహిళలు ధృడ సంకల్పంతో ముందుకెళ్లాలని అనే కోణంలో ఆయన స్పందించారని మరికొందరు అంటున్నారు. రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు ప్రశంసలతో పాటు…రివార్డ్స్ దక్కుతున్నాయి. ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పదవి ఇచ్చింది. రెండు కోట్ల రూపాయల నగదు కూడా బహుమతి దక్కించుకుంది.
Hey this cannot be true. I am at a complete loss of words. https://t.co/4H7IPK95J7
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 29, 2021