పంచాయతీ సమరం : ఆటోవాలా సర్పంచ్

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 03:39 AM IST
పంచాయతీ సమరం : ఆటోవాలా సర్పంచ్

బజర్ హత్నూర్ : ‘పంచాయతీ’ సమరం తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమౌతుండగా…మరికొన్ని గ్రామాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ పంచాయతీ సమరంలో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని వారికి సర్పంచ్ పదవులు కొంతమందిని వరిస్తున్నాయి. ఓ ఆటోవాలాకు సర్పంచ్ పదవి దక్కింది. ఇది బజర్ హత్నూర్‌లో చోటు చేసుకుంది. 
అందుగూడ సర్పంచ్ : 
అందుగూడ పరిధిలో అందుగూడ, కొత్తగూడ, చింతకర్ర గ్రామాలున్నాయి. ఇక్కడ అందుగూడలో శంకర్ (28) అనే యువకుడు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనే స్వభావం కలిగి ఉన్నవాడు. అత్యవసర సమయాల్లో గ్రామస్తులకు చేదోడువాదోడుగా నిలుస్తుండేవాడు. ఆసుపత్రులకు వెళ్తలాలంటే తన ఆటోలో తరలిస్తూ అక్కడి గ్రామ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. ఇదే అతనికి ప్లస్ పాయింట్‌గా మారింది. సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఇతనిని సర్పంచ్ కర్చీలో కూర్చొబెడితే ఎలా ఉంటుందనే ఆలోచన అందుగూడ గ్రామ ప్రజలకు వచ్చింది. వెంటనే అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసేశారు. శంకర్‌ని సర్పంచ్ ఎంపిక చేశారు. తనను సర్పంచ్‌‌గా  ఎంపిక చేయడం పట్ల శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాభివ‌ృద్ధికి తనవంతు కృషి చేస్తానని శంకర్ తెలిపాడు. బెస్టాఫ్ లక్ శంకర్…
 

Read More : పంచాయతీ సమరం : నగరంలో పల్లె ఓటర్ల కోసం గాలింపుRead More : పంచాయతీ సమరం : ‘గుర్తుండేలా’ ప్రచారం