వార్నీ.. అమెజాన్‌లో Passport కవర్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది
ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే.. మరొకటి డెలివరీ చేస్తున్నాయి ఈ-కామర్స్ కంపెనీలు. ఇటీవలి కాలంలో ఇలాంటి తప్పిదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
Passport : ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే.. మరొకటి డెలివరీ చేస్తున్నాయి ఈ-కామర్స్ కంపెనీలు. ఇటీవలి కాలంలో ఇలాంటి తప్పిదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య ఓ వ్యక్తి అమెజాన్ లో ఐఫోన్ 12 ఆర్డర్ చేస్తే.. అతడికి విమ్ డిష్ బార్, రూ.5 కాయిన్ డెలివరీ కావడం సంచలనం రేపింది. అది మర్చిపోకముందే అంతకుమించిన షాకింగ్ ఘటన మరొకటి కేరళలో చోటు చేసుకుంది.
Smokers Food : సిగరెట్ తాగే వారు ఈ ఆహారం తింటే ఊపిరితిత్తులు సేఫ్…
ఓ వ్యక్తి పాస్‌పోర్ట్ కవర్ కోసం అమెజాన్‌లో ఆర్డర్ చేశాడు. డెలివరీ వచ్చాక అందులో ఉన్నది చూసి కంగుతిన్నాడు. అతడు పాస్‌పోర్ట్ కవర్ కోసం ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
కేరళ వయనాడుకు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి 2021, అక్టోబర్ 1న అమెజాన్‌లో పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ నవంబర్ 1న ఆర్డర్‌ని డెలివరీ చేశాడు. బాక్స్ తెరిచి చూడగా, అందులో పాస్‌పోర్ట్ కవర్‌తో పాటు ఒరిజనల్ పాస్‌పోర్ట్ కూడా కనిపించింది. అది చూసి అతడు షాక్ అయ్యాడు. ఇక ఆ పాస్‌పోర్ట్ కేరళ త్రిస్సూర్‌కు చెందిన మహ్మద్ సాలిహ్ అనే వ్యక్తికి సంబంధించింది.
Heart Attack : అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుందంటే?..
వెంటనే మిథున్ బాబు అమెజాన్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి.. జరిగిన దాని గురించి వివరించాడు. అంతా విన్న కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ముందు షాక్ అయ్యి.. ఆ తర్వాత భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చాడు. అయితే ఇక్కడ మిథున్ బాబుకు, నెటిజన్లకు అర్థం కాని విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి ఒరిజనల్ పాస్‌పోర్ట్ అమెజాన్ కంపెనీ దగ్గరకు ఎలా చేరింది? ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.