Smokers Food : సిగరెట్ తాగే వారు ఈ ఆహారం తింటే ఊపిరితిత్తులు సేఫ్…

వెల్లుల్లి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరంలో ఉండే మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది. నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.

Smokers Food : సిగరెట్ తాగే వారు ఈ ఆహారం తింటే ఊపిరితిత్తులు సేఫ్…

Smokers Food

Smokers Food : ధూమపానం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగరెట్స్ తాగుతూనే ఉంటారు. నికోటిన్ అనే పదార్ధం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వివిధ రకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సిగరెట్‌లో ఆర్సినిక్, ఫార్మాల్డిహైడ్, లెడ్, హైడ్రోజన్ సైనైడ్, నైట్రోజెన్ ఆక్సిడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా లాంటి 43 రకాల తెలిసిన కార్సినోజెన్‌లు ఉన్నాయి. ఇక పేరు తెలియని హానికర రసాయనాలు దాదాపు 4000 రకాలు ఉన్నాయి. వీటి ఫలితంగా ఊపిరితిత్తులు, స్వరపేటిక, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణకోశం వంటి అన్ని అవయవాలూ క్యాన్సర్‌కు గురికావచ్చు. బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి జబ్బులూ రావచ్చు.

సిగరెట్ పొగను పీల్చిన 10 సెకండ్లలో అందులోని నికోటిన్ మెదడును చేరుతుంది. సిగరెట్ తాగేవారి ప్రతి అవయవంలోనూ నికోటిన్ ఉంటుంది… సిగరెట్ తాగడం వల్ల జీర్ణక్రియ జరగాల్సిన దానికంటే ఆలస్యంగా జరుగుతుంది. అంటే జీర్ణమయ్యే ఆహారం ఉండాల్సిన వ్యవధికంటే ఎక్కువసేపు పేగుల్లో ఉంటుంది. నికోటిన్ ప్రభావం ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం…

సిగరెట్ తాగేవారికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. రోగనిరోధక  శక్తిని పెంచుతుంది.  శరీరంలో ఉండే మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది. నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఊపిరితిత్తుల్లోని నికోటిన్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. రక్తంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది. ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది. దానిమ్మను పండు తిన్నా దాంతో జ్యూస్ చేసుకుని తాగినా చాలా ప్రయోజనాలుంటాయి. దానిమ్మలోనూ యాంటీఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉంటాయి. దానిమ్మను తరుచూ తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

ధూమపానం చేసే వారు రోజూ క్యారెట్ తినడం చాలా మంచిది. క్యారెట్ లో విటమిన్ ఏ, సీ, కే, బీ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం. అలాగే నికోటిన్ ను వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. బ్రోటకలీ పొగతాగే వారిలో నికోటిన్ ప్రభావం ఆరోగ్యంపై పడకుండా కాపాడుతుంది. బ్రోకలీలో విటమిన్ సీ, బీ 5 లో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సీ ను పొగతాగడం వల్ల కలిగే నష్టాలను నివారించగలదు. కాలీఫ్లవర్, కాలే, టర్నిప్, క్యాబేజీ వంటి కూరగాయాలతో తయారు చేసిన పదార్థాలను తరుచుగా తింటూ ఉంటే మీ ఆరోగ్యంపై నికోటిన్ ప్రభావం అంతగా ఉండదు.

నికోటిన్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీయకుండా చేయగల గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ధూమపానం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడవచ్చు. సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలుకలుగుతుంది. యాపిల్స్ లో చాలా పోషకాలుంటాయి. ఇందులో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనామ్లజనకాలు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడతాయి.