థ్యాంక్స్ నయన్ – కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, త‌న బ్యూటీ ప్రొడ‌క్ట్స్ (కే బై క‌త్రినా) కోసం లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌తో క‌లిసి ఓ వీడియో రూపొందించింది..

  • Published By: sekhar ,Published On : October 22, 2019 / 09:45 AM IST
థ్యాంక్స్ నయన్ – కత్రినా కైఫ్

Updated On : May 28, 2020 / 4:13 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, త‌న బ్యూటీ ప్రొడ‌క్ట్స్ (కే బై క‌త్రినా) కోసం లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌తో క‌లిసి ఓ వీడియో రూపొందించింది..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌కు థ్యాంక్స్ చెప్పింది. క‌త్రినా ఈ మధ్య సౌంద‌ర్య ఉత్ప‌త్తుల రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘కే బై క‌త్రినా’ పేరుతో క‌త్రినా ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రీసెంట్‌గా జరిగిన ‘వోగ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్స్ ఫంక్షన్‌లో తన ప్రొడెక్ట్స్ కోసం రణవీర్ సింగ్‌తో కలిసి వీడియో రూపొందించిన కత్రినా ఇప్పుడు త‌న బ్యూటీ ప్రొడ‌క్ట్స్ కోసం న‌య‌న‌తార‌తో క‌లిసి ఓ వీడియో రూపొందించింది.

Read Also : ‘రాములో రాములా.. నన్నాగంజేసిందిరో’..

దీనికి సంబంధించిన క్లిప్‌ను క‌త్రినా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘సినిమాలతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నా బ్రాండ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ముంబై వ‌చ్చిన సౌత్ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌కు థ్యాంక్స్‌’ అని వీడియో క్లిప్ షేర్ చేయగా.. వైరల్ అవుతోంది.